FbTelugu

బైక్ పై వెళుతున్న వ్యక్తిపై కత్తులతో దాడి

గుంటూరు: బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటన జిల్లాలోని గురజాల మండలం అంబాపురంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. విక్రమ్ అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా.. కొందరు గుర్తుతెలియని దుండగులు వెంటాడి కత్తులతో నరికి చంపారు. దీంతో మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాత కక్షలతోనే దుండగులు హత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like