FbTelugu

తహశీల్దార్ పై కత్తితో దాడి

బెంగుళూరు: సర్వేచేయడానికి వెళ్లిన తహశీల్దార్ పై కత్తితో దాడి చేయడంతో మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా పెరియకలవంచి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ భూములను సర్వే చేయడానికి వెళ్లిన తహశీల్దార్ చంద్ర మౌలేశ్వర్ ను సర్వే చేయొద్దంటూ.. రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటపతి అడ్డుకున్నాడు.

అయినప్పటికీ చంద్రమౌలేశ్వర్ పోలీసుల సాయంతో సర్వే చేయించాడు. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటపతి కత్తిలో తహశీల్దార్ పై దాడి చేశాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.