FbTelugu

2 నిమిషాలు ఆలస్యం… వైన్ షాపు ఉద్యోగిపై దాడి

హైదరాబాద్: గోపి అనే డ్రైవర్ బోరబండ ఎస్పీఆర్ హిల్స్ లో కాకతీయ వైన్ షాపు కు వెళ్లాడు. మద్యం బాటిల్ కొనుగోలు చేసిన తరువాత డబ్బులు చెల్లించేందుకు రెడీ కాగా, క్యూఆర్ కోడ్ రెండు నిమిషాలు ఆలస్యంగా ఓపెన్ అయ్యింది.

ఇంత ఆలస్యమా అంటూ కొనుగోలుదారుడు గోపి, బాటిల్ ఇచ్చిన సేల్స్ మెన్ రంజిత్ పై దాడికి తెగబడ్డాడు. కొనుగోలు చేసిన బాటిల్ తోనే బలంగా తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది మూకుమ్మడిగా గోపి పై దాడి చేశారు. తనపై దాడి చేశారంటూ గోపి మళ్లీ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

You might also like

Leave A Reply

Your email address will not be published.