FbTelugu

పిందెలు తెంపారని ఇద్దరిపై అమానుషం

మహబూబాబాద్: ఎండాకాలంతో పాటు కరోనా మహమ్మారి కావడంతో పిల్లలు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఆట విడుపుకోసం ఉదయం, సాయంత్రం పూట బయటకు వెళ్లి వస్తుంటారు. మామిడి పిందెలు కన్పించడంతో తోట లోపలికి వెళ్లి తెంపడంతో కాపాలాదారులు ఆగ్రహించి అమానుషంగా ప్రవర్తించారు.

ఈ ఘటన తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారుగా ఉంటున్నారు. గురువారం నాడు తొర్రూరుకు చెందిన ఇద్దరు అబ్బాయిలు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా మామిడి తోట కన్పించడంతో లోపలికి వెళ్లి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్‌ పరుగున వచ్చి ఇద్దరు అబ్బాయిలను పట్టుకుని చేతులు కట్టేశాడు. కర్రలు చేతబుచ్చుకుని చితకబాదాడు. అంతటితో ఆగకుండా పేడను నోట్లో కుక్కి పైశాచికంగా వ్యవహరించాడు. ఈ ఘటనను చూసిన ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో తొర్రూర్ పోలీసు స్టేషన్ అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ప్రారంభించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.