FbTelugu

ప్రశ్నించిన పోలీసులపైనే దాడి

కరోనా నేపథ్యంలో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. కాగా మాస్కులు ధరించకుండా బయటతిరుగుతున్న కొందరిని ఇదేంటని ప్రశ్నించగా ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి కొందరు ముఖాలకు మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతుండగా వారిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఆ యువకులు ఆయుధాలతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like