FbTelugu

కుక్కను పెంచిన మహిళపై దాడి.. మృతి

ఓ మహిళ పెంచిన కుక్క నిరంతరం ఇతరులను చూసి మొరుగుతోందని ఆగ్రహానికి గురైన పక్కింటి వారు ఆ మహిళపై దాడి చేయడంతో గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ మహిళ ఓ కుక్కను పెంచుకుంది. కాగా ఆ కుక్క ఎవ్వరిని చూసినా బాగా మొరిగేది. దీంతో కోపోద్రేకులైన పక్కింటివారు ఆమెపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అనంతరం వారు వెళ్లిపోయారు. అయితే దాడి చేసిన అనంతరం ఆ బాధిత మహిళకు చాతిదగ్గర విపరీతమైన నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతోనే మృతి చెందినట్టు దృవీకరించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More