FbTelugu

కుక్కపిల్ల గొడవ… మంగళసూత్రం చోరీ

అమరావతి: ఎంపీటీసీ అభ్యర్థి రూపారేఖ పై దాడిచేసి మాంగళసూత్రం లాక్కెళ్లిన సంఘటన చౌడేపల్లె మండలంలో జరిగింది.

బాధితురాలు రూపారేఖ చౌడేపల్లె-1 సెగ్మెంట్‌కు నామినేషన్ వేసి స్థానిక సంతగేటు సమీపంలో ఉంటున్నారు. భద్రత కోసం ఆమె 20 రోజుల క్రితం ఒక కుక్క పిల్లను తెచ్చి పెంచుకుంటోంది. వీరి ఇంటి పక్కనే జిల్లా మైనారిటీ కార్యదర్శి మహ్మద్‌ఆలీ బావ బాషా అద్దెకు ఉంటున్నారు. ఈక్రమంలో కుక్క అరుస్తోందని ఆదివారం రాత్రి బాషా.. రూపా రేఖపై గొడవకు దిగాడు. కొద్ది సమయం తరువాత మద్యం సేవించి వచ్చి మళ్లీ గొడవకు దిగి, ఇరువురూ తోపులాడుకున్నారు.

ఈ క్రమంలో బాషా ఆమె మెడలోని బంగారు మంగళసూత్రం లాక్కెళ్లాడు. మళ్లీ ఉదయం కూడా గొడవకు దిగడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.