FbTelugu

ఎంపి అర్వింద్ పై కోడిగుడ్లతో దాడి

నిజామాబాద్: తాళ్ల రాంపూర్ సహకార సంఘం ఎదుట ధర్నా చేసేందుకు వచ్చిన బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ వాహనంపై కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.

పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టిఆర్ఎస్ కార్యకర్తలు నిలదీయగా, బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. ఈ లోపు టిఆర్ఎస్ కార్యకర్త గడ్డం శ్రీనివాస్ కోడిగుడ్లను ఎం.పి వాహనం పైకి విసిరాడు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఎం.పి అర్వింద్ మాట్లాడుతూ, గ్రామాల్లో టిఆర్ఎస్ నాయకులు తిరిగితే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నించాలని సూచించారు. సిఎం కెసిఆర్ రాష్ట్రానికి పెద్ద కచరా గాడని అన్నారు. భైంసాలో ముస్లింలు గొడవ చేస్తే ముస్లింలతో పాటు హిందువులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.