గుంటూరు: నిన్న వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి ఓ టోల్ గేట్ వద్ద సిబ్బందితో తీవ్రంగా వాగ్వాదానికి దిగి హల్ చల్ చేయగా.. ఇవాళ ఆమె మేనల్లుడు వడియా రాజు జిల్లాలోని దాచేపల్లి నర్సింగ్ హోమ్ లో హల్ చల్ చేశాడు. బిల్లు చెల్లించకుండా ఆస్పత్రి సిబ్బందిపై దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.
బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ.. సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ తతంగం అంతా సీసీటీవీలో రికార్డయింది. వడియరాజుపై చర్యలు తీసుకోవాలంటూ.. నర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు.