FbTelugu

ప్రేమ వివాహం.. కూతురు, అల్లునిపై దాడి

పశ్చిమ గోదావరి: ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు, అల్లునిపై ఓ వ్యక్తి దాడికి దిగిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఏలూరులో ఓ మంత్రి గన్ మెన్ కూతురు ఐదు నెలల క్రితమే పోలీసుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది.

తన కూతురి వివాహం ఏమాత్రం ఇష్టం లేని గన్ మెన్ ఇవాళ తన కూతురు, అల్లునిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం గన్ మెన్ కూతురు మూడు నెలల గర్భిణిగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

You might also like