FbTelugu

న్యాయం కోసం వెళ్లిన మహిళపై ఎస్సై దాడి

తిరుపతి : ఓ ఘర్షణలో తనకు జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని వెళ్లిన ఓ మహిళపై ఎస్సై దాడికి దిగిన ఘటన తిరుపతిలోని ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వనితావాణి అనే మహిళ ఆటో నడపుతూ ఉప్పరపల్లెలో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలోనే తనకు తనపొరుగువారితో ఘర్షణ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. స్టేషన్ లో ఎస్సై ఫిర్యాదు తీసుకోకుండా ఆమెను బయటకి వెళ్లమంటూ దాడికి పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. ఈ ఘటనపై స్సంధించిన సీఐ విచారణ జరిపి న్యాయం చేయిస్తానంటూ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.