FbTelugu

మోదీ జాతికి క్షమాపణ చెప్పు: కాంగ్రెస్ దాడి

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పౌరుడికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్ధేశించి ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి మొదలు పెట్టింది.

మోదీజి మాటలు చెప్పడం కాదు ముందుగా జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోదీ అబద్దాలాడుతున్నారని, మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆరోపించింది. సరైన వైద్యం అందక, సకాలంలో ఆక్సిజన్ లభించక లక్షలాది మంది చనిపోయారు. ఇప్పటికీ చనిపోతునే ఉన్నారు. ఇవేమి పట్టించుకోకుండా మోదీ కెమెరా ముందుకు వచ్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. ఉచిత వ్యాక్సిన్ ప్రకటనపై కూడా విరుచుకుపడింది. మాటలు చెప్పడమే కాని ఇంత వరకు ఏదీ చేతల్లో చూపించలేదన్నారు. గతంలో ఇలాంటి అనేక ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెట్టారని కాంగ్రెస్ ఘాటుగా స్పందించిం

You might also like

Leave A Reply

Your email address will not be published.