FbTelugu

అటాక్ చిత్రంపై జనం అటాక్

లక్నో: అటాక్ చిత్రం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో స్థానికులు, సెక్యురిటీ సిబ్బంది మధ్య స్వల్ప గొడవలు జరగడంతో రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ధనిపూర్ లో అటాక్ చిత్రం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. సినిమాలో భాగంగా డమ్మీ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. హీరో జాన్ అబ్రహం, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సెట్స్ వద్దకు చేరుకున నటీనటులను చూసేందుకు ఎగబడ్డారు. సమీపానికి రావడంతో సెక్యురిటీ గార్డులు వారిని నిలువరించడంతో ఆగ్రహానికి లోనైన స్థానికులు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో సెక్యురిటీ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా, నటీనటులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈలోపు పోలీసులు రావడంతో స్థానికులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. ఈ సినిమాకు లక్ష్యరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, ఆగస్టులో విడుదల చేయాలని నిర్ణయించారు. రకుల్ ఈ సినిమాతో పాటు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మే డే లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నది. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో రకుల్ నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.