FbTelugu

వేటకొడవళ్లతో టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడి

కర్నూలు: భూ వివాదంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో ఇరువర్గాలు దాడికి పాల్పడిన ఘటన జిల్లాలోని పెదబంకూరు మండలం హనుమపురంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఓ భూవివాదంలో ఘర్షణ తలెత్తింది. దీంతో వేటకొడవళ్లతో ఇరువర్గాల వారు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 11 మందికి తీవ్రగాయాలైనాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

You might also like