FbTelugu

నడిరోడ్డుపై వేటకొడవళ్లతో దాడి

నల్లగొండ: కొండమల్లేపల్లిలో అందరూ చూస్తుండగానే పట్టపగలు ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికారు.

సాగర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ఓ వ్యక్తి రోడ్డుపై నిల్చుని ఉన్నాడు. ఇంతలోనే ఓ ముగ్గురు వ్యక్తులు ఆ వ్యక్తి ఉన్న దగ్గరికి వచ్చారు. వచ్చి రావడంతోనే అందరూ చూస్తుండగానే వేట కోడవళ్లతో అతి కిరాతకంగా దాడి చేశారు. బాధితుడు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటుండగానే చనిపోయాడని నిర్థరించుకుని అక్కడి నుంచి ఆ  ముగ్గురు దుండగులు పరారీ అయ్యారు. ప్రత్యక్ష సాక్షులు ఫోన్ చేయడంతో వెంటనే  పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని, గంటలు గడిస్తే కాని చెప్పలేమని వైద్యులు తెలిపారు.

You might also like