FbTelugu

దారుణం.. శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

లక్నో: శివాలయంలో ఇద్దరు సాధువులను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్ షహర్ లో స్థానిక శివాలయంలో ఇద్దరు సాధువులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

సాధువులను రక్తపు మడుగులో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాధువుల హత్యతో గ్రామంలో కల్లోలం చలరేగింది. దీంతో పోలీసులు అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపినట్టు తెలిపారు.

You might also like