FbTelugu

ప్రేమికుడిని కొట్టి చంపారు

హైదరాబాద్: బాలానగర్ శోభన కాలనీలో దారుణం జరిగింది. ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడిని ఆమె తల్లిదండ్రులు కొట్టిచంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో శోభన కాలనీకి శుభం (26) అనే యువకుడు వెళ్లాడు. శుభం జగద్గిరిగుట్ట నెహ్రూనగర్ లో నివాసం ఉంటున్నాడు. ప్రియురాలిని బయటకు రావాల్సిందిగా కోరగా, ఆమె బయటకు వచ్చేందుకు నిరాకరించింది. ఆమెను బయటకు పంపించాలని తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. బయటకు రాలేనని ప్రియురాలు తెగేసి చెప్పడంతో మనస్థాపానికి గురైన యువకుడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రియురాలి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే శుభం తండ్రి వాదన మరోలా ఉంది. తన కుమారుడిని ప్రియురాలి తల్లిదండ్రులు కొట్టి చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని కథ అల్లుతున్నారని ఆరోపించాడు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని రోదిస్తూ చెప్పాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని శుభం తండ్రి డిమాండ్ చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.