FbTelugu

దారుణం.. తండ్రిని హతమార్చిన కొడుకు

అనంతపురం : కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చిన ఘటన జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మామిళ్లపల్లిలో నారాయణ స్వామి అనే వ్యక్తిని అతని కన్న కొడుకు గణేష్(నిందితుడు) అతి దారుణంగా కొడవలితో నరికి హతమార్చాడు. గత కొంత కాలంగా వారింట్లో కుటుంబ కలహాలు చోటుచేసుకుంటున్నట్టుగా గుర్తించారు.

ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో వచ్చిన కొడుకు తండ్రితో గొడవకు దిగి కొడవలితో తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నారాయణ ప్రాణాలు వదిలారు. తండ్రిని హతమార్చడంలో కోడలు సహకరించినట్టుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.