FbTelugu

కాకినాడలో దారుణం…

తూ.గో.జిల్లా: కాకినాడలో అమానుష ఘటన జరిగింది. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికను బుధవారం ఉదయం అపహరించిన దుండగుడు లైంగికదాడికి పాల్పడి ముళ్లపొదల్లో పడేశాడు. కామాంధుడి కర్కశత్వంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం గోళీలపేటకు చెందిన కూలీ పిల్లి రాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాలిక తల్లి కుటుంబపోషణ నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటుండగా, పిల్లలు వారి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నారు.

బుధవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న రాజు పెద్దకుమార్తె అయిన ఐదేళ్ల బాలికను అర్ధరాత్రి సమయంలో ఓ కామాంధుడు ఎత్తుకెళ్లాడు. గోళీలపేట శివారు శ్మశానవాటిక వద్దగల తుప్పల్లోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూసి కుటుంబసభ్యులకు అప్పగించాడు. వెంటనే చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పరామర్శించారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఏపీలో పలు చోట్ల వర్షాలు
అమరావతి: నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తూర్పు గోదావరి, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం తో పాటు తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి.
బలమైన ఈదురు గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. తిరుమలలో పాపవినాశనం దారిపై కూలిన వృక్షాలను అటవీ సిబ్బంది తొలగించారు. మరోవైపు తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తుఫాన్ కారణంగా విజయవాడ విమానాశ్రయంలో కొన్ని విమనాల రాకపోకలను రద్దు చేశారు. తిరుపతిలో విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 8 రైళ్లను రద్దు చేసింది. ఢిల్లీ నుంచి రేణిగుంట రావాల్సిన విమానం వాతావరణం అనుకూలించక బెంగళూర్ లో ల్యాండ్ అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.