FbTelugu

ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టించారు: నారా లోకేశ్

అమరావతి: రాజధాని రైతులపై ప్రభుత్వ వైఖరి పట్ల టీడీపీ జాతీయ కార్యదర్శి మరోమారు తీవ్రంగా ఫైర్ అయ్యారు. రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం జ‌గ‌న్‌రెడ్డి శాడిజానికి ప‌రాకాష్ట‌అని అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతి ఉద్యమం ఊపిరి పోసుకున్న మొదటి రోజు నుండి రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ఎంతోమంది రైతులకు సహాయాన్ని అందిస్తున్నారు. అందరి సహకారంతో జై అమరావతి ఉద్యమం 346వ రోజుకి చేరుకుంది.

తుగ్లక్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటానికి తమ వంతు సహాయంగా తెలుగుదేశం ఫోరం సింగపూర్ సభ్యులు పంపిన రెండు లక్షల యాభై వేల రూపాయిల చెక్ అమరావతి పరిరక్షణ సమితికి అందజేసాను. రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతులకు అండగా నిలిచిన తెలుగుదేశం ఫోరం సింగపూర్ సభ్యులను అభినందిస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.