FbTelugu

రూ.1.23 కోట్లకు ఏటీఎం సిబ్బంది టోకరా

హైదరాబాద్: ఏటీఎం సిబ్బంది రూ.1.23 కోట్లకు టోకరా వేసిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం యంత్రాలలో డబ్బు డిపాజిట్ చేసే కాంట్రాక్ట్ తో క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ రీప్లేన్స్ మెంట్ సర్వీస్ నిర్వహిస్తున్న సికింద్రాబాద్ ‘సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ 36 ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్ చేసేందుకు ‘బీటీఐ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

బిటిఐ లో రాజశేఖర్ రెడ్డి, రమా భారత్, సాయి తేజ, అశ్విన్ లను కస్టోడియన్లుగా నియమించి ఏటీఎం తాళాలు, పాస్ వర్డులు వారికి అప్పగించారు. రాజశేఖర్ రెడ్డి తో పాటు మిగతా ముగ్గురు కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న రూట్లలో రిపోర్టు రాకపోవడంతో. కంపెనీ ప్రతినిధులు ఆడిటింగ్ నిర్వహించారు. ఈ ఆడిటింగ్ లో రూ.1.23 కోట్ల అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు.

You might also like