FbTelugu

అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు…

అమరావతి: ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమని రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెఢ్డి భవానీ, ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  కక్ష సాధింపుతో బలమైన బీసీ నేతను అక్రమంగా అరెస్టు చేయించారని వారు విమర్శించారు.

మా కుటుంబం గత 35  సంవత్సరాలుగా రాజకీయాల్ల ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అవినీతిపై నిలదీస్తున్నందుకే కక్ష కట్టి అరెస్టు చేయించారు. జగన్ ప్రతాపం ఇదేనా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కోలేక ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో భయాన్ని సృష్టించడానికి, ప్రశ్నించకూడదు అన్న ధోరణిలో వెళుతున్నారని వారు విమర్శించారు.  అచ్చెన్నాయుడు అరెస్టుకు జగన్ సూత్రధారి అని, పగబట్టారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. సబ్జెక్ట్ పై మాట్లాడితే.. వాళ్ల దగ్గర సమాధానం లేదన్నారు.

You might also like