FbTelugu

ఆస్ట్రాజెనెకా బంపర్ డీల్

లండన్: అంతర్జాతీయ డ్రగ్ కంపెనీ ఆస్ట్రాజెనెకా, జర్మన్ ఫార్మా గ్రెనెంథాల్ జీఎంబీహెచ్ మధ్య భారీ డీల్ కుదిరింది. ఈ డీల్ లో కొలెస్ట్రాల్ డ్రగ్ క్రెస్టర్ ను గ్రెనెంథాల్ కు 320 మిలియన్ డాలర్లకు ఆస్ట్రాజెనెకా విక్రయించింది.

ప్రపంచలోనే ఈ ఔషధం అత్యధికంగా విక్రయమవుతోంది. కంపెనీ మొత్తం ఆదాయం ఇదొక్కటే 20శాతం ఆదాయాన్ని ఆర్జించడం విశేషం. కాగా 2016లో క్యాన్సర్ వ్యాధి కోసం టగ్రిస్సో, ఇమ్ఫింజి, తీవ్రమైన అస్తమా కోసం ఫెసెన్నా వంటి చవకైన మందులు రావడంతో క్రెస్టర్ మందుకు ఎదురు దెబ్బ తగిలింది.
తాజా డీల్ ప్రకారం క్రెస్టర్ మందును యూకె, స్పెయిన్ మినహా యూరప్ లోని 30 దేశాల్లో అమ్ముకునే అవకాశం గ్రెనెంథాల్ కు లభించింది. వ్చే ఏడాది మార్చి నాటికి ఈ డీల్ ముగుస్తుందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.