FbTelugu

ఆ కుటుంబానికి అన్నీ ఇస్తున్నాం: ఏపీ ప్రభుత్వం

అమరావతి: చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర రావు కు ఏపీ ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు ఇలా ఉన్నాయి.

నటుడు సోనూసూద్‌ ఆ కుటుంబానికి ట్రాక్టర్‌ సహాయం చేసిన విషయం తెలిసిందే. కాడేద్దులు లేకపోవడంతో ఇద్దరు కుమార్తెలతో నాగలి పట్టించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సోనూసూద్ స్పందించారు. అయితే ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఏపీ ప్రభుత్వం స్థానిక ఎంపీడీఓ ను ఆదేశించింది. ఏంపీడీఓ విచారణలో వెల్లడైన విషయాలు ఇవీ.

1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ.
3. నాగేశ్వర రావు చిన్నకుమార్తెకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురు జగనన్న తోడు కింద లబ్ధికోసం దరఖాస్తు చేశారు. చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. తల్లి కు అభయహస్తం కింద పెన్షన్‌ అందుకుంటోంది.
6. తండ్రి కు వృద్ధాప్య పెన్షన్‌ కింద ప్రతి నెలా రూ.2250లు అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని కుటుంబం అందుకుంది. ఉచిత రేషన్‌కూడా తీసుకుంది.
8. 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలు తీసుకున్నారు.

You might also like