FbTelugu

అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి: బాబు సవాల్

అమరావతి: మూడు ముక్కలాట ఆడే అధికారం ఎవరిచ్చారని, ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కు సవాల్ విసిరారు.

అప్పుడు మీకు మెజార్టీ వస్తే మేం మాట్లాడమని ఆయన అన్నారు. ఆనాడు మీరు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి చేసి ఉంటే మేం ప్రశ్నించేవాళ్లం కాదన్నారు. ప్రజలను నమ్మించి ఎందుకు మోసం చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఇది నయవంచన, దగా అని ఆయన ఆరోపించారు. అధికారం వచ్చిందని ఇష్ట ప్రకారం చేస్తారా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి నిర్మాణం చేస్తునన్నామని ఆనాడు స్పష్టంగా చెప్పాని చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 251 రోజులుగా ఆందోళన చేస్తుంటే కనికరం కూడా లేదన్నారు.

You might also like