FbTelugu

సుబ్బయ్య హత్యకు కారణం అదేనా?

కడప: టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకేసులో తాజాగా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసినట్టుగా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన వెల్లడించారు. గతంలో సుబ్బయ్యకు, ప్రస్తుత హత్య కేసులో నిందితులకు మధ్య వివాదం ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిపారు. గతంలో ఏ1 ముద్దాయి కుండా రవి, ఏ2 ముద్దాయి అనిల్ కుటుంబ సభ్యుల పట్ల సుబ్బయ్య అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించామన్నారు. ఆరేళ్ల క్రితం జరిగిన గొడవే సుబ్బయ్య హత్యకు కారణంగా ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా వారిపపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.