FbTelugu

కరోనాతో ఏఎస్ఐ మృతి

హైదరాబాద్: ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సమీర్ ఉద్దీన్ (57) కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. టోలిచౌకి లో ఉంటున్న ఏఎస్ఐ కి ఈనెల 19న కరోనా పరీక్షలు నిర్వహించారు. మరుసటి రోజున అనగా 20వ తేదీన పాజిటివ్ అంటూ రిపోర్టులు వచ్చాయి.

నిర్ధారణ అయిన తరువాత కిమ్స్ ఆసుపత్రిలో అదేరోజు చేరిపోయాడు. సోమవారం సాయంత్రం పరిస్థితి విషమించి శ్వాస ఆడక మృతి చెందినట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.