FbTelugu

కరోనాతో ఏఎస్‌ఐ కన్నుమూత

రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా ఈ మహమ్మారి మరో పోలీసు అధికారిని బలికొంది. వివరాల్లోకెళితే.. వేములవాడలో ఏఆర్ ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న అన్నారం కనకయ్య అనే వ్యక్తి ఇటీవల కరోనా బారిన పడ్డారు.

దీంతో అతన్ని వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఏఎస్ఐ మృతి పట్ల పోలీసులు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.