FbTelugu

పేకాడుతూ దొరికిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు

చిత్తూరు: కంచె చేను మేసిన చందంగా.. వద్దని దండించాల్సిన పోలీసులే లాడ్జిలో పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన జిల్లాలోని పలమనేరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు నిన్న (మంగళవారం) భోజన విరామ సమయంలో యూనిఫాంలోనే ఓ లాడ్జీలో పేకాటాడుతూ స్థానిక పోలీసులకు దొరికిపోయారు.

వీరి నుంచి స్థానిక పోలీసులు రూ.9 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దొరికింది తమవారే కావడంతో తొలుత ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు బయటికి పొక్కకుండా చూసినప్పటికీ విలేఖరులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత చర్యలకు ఉపక్రమించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.