FbTelugu

సింహాచలం స్వామిని దర్శించుకున్న అశోక్ గజపతి

విశాఖపట్నం: సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆలయ ట్రస్టీ, మాజీ కేంద్ర మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు సంప్రదాయం ప్రకారం అశోక్ గజపతి రాజుకు పూజలు చేసి ఆశీర్వదించారు.

ప్రత్యేక పూజా కార్యక్రమాలు, దర్శనం తరువాత ఆయన గోశాలను సందర్శించారు. ఎన్ని గోవులు ఉన్నాయి, వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటనే దానిపై నిర్వాహకులతో ఆరా తీశారు. పూర్తి వివరాలు తనకు అందచేయాల్సిందిగా ఆదేశించారు. గతేడాది మార్చి నెలలో ఆలయ ఛైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతిని తొలగిస్తూ జగన్ ప్రభుత్వం జిఒ జారీ చేసింది. ఆయన స్థానంలో సోదరుడి కుమార్తె సంచయితను నియమించింది. కుమారి సంచయిత నియామకాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో సవాల్ చేగా పునర్ నియామకం చేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు అనుసారం బుధవారం నాడు అశోక్ గజపతి రాజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.