FbTelugu

మహిళా కార్యకర్తను కొట్టిన అశోక్ గజపతి

విజయనగరం: శాంత స్వభావం, వివాదాలకు దూరంగా ఉండే మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నాయకుడు అశోక్ గజపతి రాజు కూడా కోపాన్ని నియంత్రించలేకపోయారు. తనపై పూలు చల్లిన మహిళా కార్యకర్తపై అందరి ముందే చేయి చేసుకోవడం అక్కడున్నవారిని షాక్ కు గురి చేసింది.

ఇవాళ నిర్వహించిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా నగరంలో పూల్ బాగ్ లో సమావేశం జరిగింది. సమావేశానికి వస్తున్న అశోక్ గజపతిపై ఒక మహిళ పూలు చల్లింది. తనపై ఉద్దేశపూర్వకంగానే పూలు చల్లిందని, అవి తన కంటికి గట్టిగా తగిలాయని ఆగ్రహానికి గురైన అశోక్ గజపతిరాజు ఆమెపై చేయి చేసుకున్నారు. మహిళా దినోత్సవం రోజే మహిళపై చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు నిశ్చేష్టులయ్యారు. సౌమ్యంగా ఉండే ఆయన చేయి చేసుకోవడం ఏంటని ఉలిక్కిపడ్డారు. పెద్దాయన బాధతోనే ఇలా చేశారని, వేరే ఉద్దేశ్యం లేదని కార్యకర్తలు ఆమెకు సర్ధిచెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.