FbTelugu

‘అసంతృప్తిగా ఉంది’: ఓవైసీ

asaduddin-owaisi-speaks-about-supreme-judgement

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య కేసుపై సుప్రీం ఇచ్చిన తీర్పుపై స్పందించారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. ఐదు ఎకరాల భూమి కోసం తాము పోరాటం చేయలేడంలేదని న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. రివ్యూ పిటషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు.

You might also like