FbTelugu

ఇలా జరిగిందేంటబ్బా!

దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇటీవల కాలంలో అసదుద్దీన్‌ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం బరిలోకి దిగుతుంది. అయితే, పార్టీ విస్తరణ కోసం తమకు బలమున్న చోట ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన చెబుతున్నా.. ముస్లిం ఓట్లు వేరే పార్టీలకు పడకుండా వాటిని చీల్చి బీజేపీ విజయానికి పరోక్షంగా సహకరించేందుకే ఆయన ఇతర రాష్ట్రాల్లో బరిలోకి దిగుతున్నారన్న విమర్శలు కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన చోట్ల ఇదే పరిస్థితి ఎదురైందని కూడా చర్చ సాగింది. సరే, ఇదంతా ఎవరికి అనుకూలంగా వారు తమ చర్యలను సమర్థించుకోవడం సహజమే. అయితే, ఇప్పుడు అదే ఫార్మూలాతో బెంగాల్‌ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఎంఐఎం సిద్ధమైంది. బెంగాల్‌ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు ఒవైసీ ప్రకటించిన వెంటనే ఆ పార్టీకి చెందిన బెంగాల్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జమీరుల్‌ హసన్‌ దానికి నిరసనగా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఆయన ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. బెంగాల్‌లో బీజేపీకి అనుకూలంగా పనిచేసేందుకే ఒవైసీ ఇక్కడకు వచ్చారని ఆయన ఆరోపించారు. తాను నందిగ్రామ్‌లో మమతా బెనర్జీతో పాటు రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తానని, వారిని ఓడించే బలమైన అభ్యర్థులకు మద్దతు తెలుపుతానని ప్రకటించారు. ఈ రెండింటికి వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులంటే లెఫ్ట్, కాంగ్రెస్‌ పార్టీలే. ఆయన ఈ పార్టీలకు మద్దతిస్తే ఎంఐఎంతో పాటు బీజేపీకి కూడా షాక్‌ తగిలినట్టే. ముస్లింల ఓట్లు మళ్లీ లెఫ్ట్‌కు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హసన్‌ తన ప్రభావాన్ని ఎంతమేరకు చూపుతాడన్న విషయం పక్కన పెడితే.. బీజేపీ, ఎంఐఎంలకు మాత్రం ఇది భారీ షాకింగే.

You might also like

Leave A Reply

Your email address will not be published.