FbTelugu

పార్టీ మారతున్నాను: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తిరుపతి: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి న్యూ ఇయర్ రోజున సంచలన ప్రకటన చేశారు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని తాను ఎప్పుడో చెప్పానన్నారు. రానున్న రోజుల్లో  రాష్ట్రంలో బీజేపీనే బలపడుతుందని ఆయన అన్నారు. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఏ.రేవంత్ రెడ్డి, తన సోదరుడు వెంకట రెడ్డి పోటీపడుతున్నారని అన్నారు. పార్టీలు వేరైనా సోదరులుగానే కలిసి ఉంటామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.