FbTelugu

సీఎం కేసీఆర్ చెప్పినట్టే చేస్తున్నాం: సి.కల్యాణ్

చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టాలని మంత్రి శ్రీనివాస్ చెప్పారు

నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడి

హైదరాబాద్: హీరోలు చిరంజీవి, నాగార్జునను లీడ్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చెప్పారని ఆయన అన్నారు.

కొందరు హీరోలు, సినీ పరిశ్రమ పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూ దందాలు చేస్తున్నారని హీరో నందమూరి బాలకృష్ణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యలకు నిర్మాత కళ్యాణ్ పై విధంగా కౌంటర్ ఇచ్చారు. సినిమా కార్మికులకు సాయం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని ఎలా కొనసాగించాలనే దానిపై శుక్రవారం సమీక్షా సమావేశం చిరు ఇంట్లో పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

సమావేశంత తరువాత కళ్యాణ్ మీడియాతో కల్యాణ్ మాట్లాడారు. సీసీసీ తరపున పరిశ్రమకు చెందిన మరెవరైనా (పోస్టర్లు అంటించేవారు తదితరులు) మిస్ అయ్యారా? అనే అంశంపై సమగ్రంగా చర్చించామని ఆయన తెలిపారు. మొన్న జరిగిన సమావేశానికి బాలయ్యను పిలవకపోవడానికి కారణం ఏమిటో నిన్ననే చెప్పానని అన్నారు. ఇలాంటి సమావేశం సినిమారంగంలో యాక్టివ్ గా ఉన్న నిర్మాతలు, దర్శకుల కోసమేనని, కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి వారు  లీడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారని అన్నారు. అందుకే వారి నాయకత్వంలో టాలీవుడ్ పరిశ్రమ బాగోగులపై ముందుకు వెళ్తున్నామని చెప్పారు. చిరంజీవి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా చెప్పారని అన్నారు. భూములు పంచుకునేందుకు మీటింగులు పెట్టుకున్నారా అని బాలయ్య ఏ ఊపులో అన్నారో తెలియదని, ఎందుకు అలా మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని కళ్యాణ్  చెప్పారు.

You might also like