FbTelugu

ఎస్సై అవతారమెత్తి.. కానిస్టేబుల్ కే బురిడీ

విజయవాడ: ఓ పోలీసునే బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. ఫేస్ బుక్ లో ఎస్సై అవతారమెత్తి ఏకంగా హెడ్ కానిస్టేబుల్ వద్దే లక్షకు టోపీ వేశాడు. ఈ ఘటన జిల్లాలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో జయన్న ఎస్సై పేరుతో ఓ నకిలీ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసుకుని హెడ్ కానిస్టేబుల్ గురుప్రసాద్ ను బురిడీ కొట్టించి లక్ష రూపాయలు వసూలు చేశాడు. అతడు ఎస్సై కాదని తెలియడంతో ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like