FbTelugu

గర్భం కోసం లద్దాఖ్ కు విదేశీ యువతుల రాక

లద్దాఖ్: ఎక్కడైనా హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఉంటుంది. కాని ఇక్కడ భిన్నంగా ఉంది. ఆ ప్రాంతానికి ప్రెగ్నెన్సీ టూరిజం పేరు పెట్టారు. ఐరోపా దేశాల్లో ఈ ప్రాంతం పేరు మారు మోగుతున్నది.
ఐరోపా యువతులు ఈ ప్రాంతం పేరు చెబితే పరవశించిపోతున్నారు. అక్కడకు ఎలాగైనా వెళ్లి, వారితో సంభోగించి గర్భంతో రావాలని కలలు కంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాశ్మీర్ లోయ లో లద్దాఖ్ లో ఆర్యన్ వ్యాలీ క్యాంప్ ఉంది.

నీలి కళ్లు కలిగి ఆరడగులకు తక్కువ కాకుండా ఆజానుబహులు నివసిస్తుంటారు. బలిష్టంగా, చూడచక్కగా ఉండే వీరి కోసం యూరప్ దేశాలకు చెందిన యువతులు తహతహలాడుతున్నారు.
అందం, ఆకారం, మేథస్సులో ఏమాత్రం తీసిపోని వీరి కోసం యువతులు ఇక్కడి వచ్చి వారితో గడిపి వెళ్లిపోతున్నారు. ప్రతి ఏటా వందలాది మంది వచ్చి వారితో శృంగారం చేసి, గర్భం దాల్చుతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్ దేశాల నుంచి అమ్మాయిలు ఎక్కువగా వస్తున్నారు. కేవలం గర్భం దాల్చేందుకు వస్తుండడంతో ఆర్యన్ వ్యాలీకి ప్రెగ్నెన్సీ టూరిజం అనే పేరు పెట్టారు. వీరి వీర్యానికి అంతగా డిమాండ్ ఉందనేది స్పష్టమవుతున్నది.
క్రీస్తు పూర్వం గ్రీకు వీరుడు అలెగ్జాండర్ రాజ్యాలను జయిస్తూ ఇండియాకు వచ్చాడు. ఇదే క్రమంలో సింధూ లోయకు కూడా వచ్చాడు. ఆ తరువాత ఇండియాకు రాకుండా వెనుదిరిగి పోయాడు. రాజ్య కాంక్ష ఉన్న ఆయన తన సైన్యంలో కొంత మందిని సింధూ లోయలో ఉండాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. అలా ఉండిపోయిన వారు ఆర్యన్ వ్యాలీలో నివసిస్తున్నారు. వీరినే చివరి ఆర్యన్లుగా పిలుస్తున్నారు. లద్దాఖ్ లో నియంత్రణ రేఖకు సమీపంలోని ఐదు గ్రామాల్లో ఆర్యన్లు నివసిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.