FbTelugu

ఏడు విమానాల్లో 1,084 మంది రాక

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలిస్తున్న విషయం తెలిసిందే. వందేభారత్ మిషన్ రెండో దశ లో భాగంగా నిన్న ఏడు విమానాల్లో 1,084 మంది భారతీయులు హైదరాబాద్ చేరుకున్నారు.

స్వీడన్‌‌లోని స్టాక్ హోమ్ నుంచి 163 మంది, నైజీరియాలోని లాగోస్ నుంచి 168 మంది, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి 148 మంది, న్యూజిలాండ్‌లోని ఆక్లామ్ నుంచి 115 మంది, మస్కట్ నుంచి 196 మంది, షికాగో నుంచి 125 మంది, మలేసియా నుంచి 177 మంది వచ్చారు.

వీరందరూ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. వైద్య పరీక్షలు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీల అనంతరం అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ ఫీజులను ముందుగానే వసూలు చేశారు. క్వారంటైన్ ముగిసిన తరువాత పరీక్షలు నిర్వహించి స్వస్థాలకు పంపించనున్నారు.

You might also like