FbTelugu

కరుడుగట్టిన ఉగ్రవాదులు అరెస్టు

ఢిల్లీ: ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన వీరిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎదురుకాల్పులు చేశారు. చాకచక్యంగా ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఆయుధాలు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకిని అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని పలు కేసులలో వీరు నిందితులుగా ఉన్నారు.

You might also like