FbTelugu

పటాకులు కాల్చినందుకు అరెస్ట్

Arrested-for-shooting-fireworks

మీరట్‌లో కొందరు యువకులు అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో పటాకులు కాల్చారు. ఈ కేసు తీర్పు నేపథ్యంలో ఎలాంటి సంబరాలు జరుపుకోవద్దని పోలీసులు ఉత్తర్వులు జారీ చేసి.. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మీరట్‌లో 144 సెక్షన్‌ విధించారు. అయినా సుప్రీం తీర్పును స్వాగతిస్తూ పటాకులు కాల్చడంతో ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోహ్రబ్‌గేట్‌ బస్టాండ్‌ వద్ద ముగ్గురిని, బ్రహ్మంపురి వద్ద మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో వైపు ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు.

You might also like