FbTelugu

కుక్కును ఈడ్చుకెళ్లినందుకు అరెస్టు

సూరత్: పట్టణంలో ఇద్దరు యువకులు తమ టూ వీలర్ వెనకాల తాడుతో కుక్కను బంధించి లాక్కెల్లిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

వేసూర్ సమీపంలోని భగవాన్ మహవీర్ కాలేజీ సమీపంలో రోడ్డుపై హితేష్ (32) ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన టూ వీలర్ వెనకాల వీధి కుక్కను తాడుతో బంధించి, రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్లాడు. అమానుషంగా తీసుకువెళ్లుండడాన్ని చూసిన సలోనీ రాఠీ అనే వ్యక్తి వీడియో తీసి ఖడోదర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీడియోను పరిశీలించిన పోలీసులు బాధ్యులైన హితేష్ ను అరెస్టు చేయగా, మరొకరి కోసం గాలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.