FbTelugu

న్యాయవాదుల హత్య కేసు నిందితుల అరెస్టు

రామగుండం: న్యాయవాదుల హత్య కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు రామగుండం పోలీసు కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హత్యకు ఉపయోగించిన నలుపు రంగు బ్రీజా కార్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ లను అరెస్టు చేశామని తెలిపారు. ఇద్దరు నిందితులను మాత్రం మహారాష్ట్ర సరిహద్దులో పట్టుకున్నారు. హత్యకు ముందు కుమార్ వెంబడించి రెక్కీ నిర్వహించారు. కుంట శ్రీను గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా గుడికి సంబంధించి వామన్ రావుతో విభేధాలు ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంక్ దగ్గర బుధవారం నాడు భార్యభర్తలైన ఇద్దరి అడ్వకేట్ల హత్య జరిగిందని మృతుడు గట్టు వామన్ రావు మరియు అతని భార్య పి.వి.నాగమణి హైదరాబాదు నుండి మంథనిలోని గౌరవ న్యాయస్థానంలో ఒక పని కోసం వచ్చారు. వారి డ్రైవర్‌ సతీష్ తో పాటు వారి క్రెటా కారు నెంబర్ టిఎస్10ఈజె 2828 లో వచ్చారు. తిరిగి హైదరాబాద్ కి వెళ్తున్న క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వచర్ల వద్ద న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి లు ప్రయాణిస్తున్న కారును ఆపారు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం జరిగిందన్నారు. వామన్ రావు డ్రైవర్ సతీష్ ఈ సంఘటన గురించి వెంటనే తండ్రి గట్టు కిషన్ రావుకు సమాచారం ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.