FbTelugu

జడ్జీలపై దూషణ… కడపలో ఒకరి అరెస్టు

అమరావతి: ఏపి హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శలు చేశారు.

న్యాయమూర్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, విమర్శలపై ఏపి హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి సిబిఐకి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం కడపలో రాజశేఖర రెడ్డి ని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో పలువురిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.