హైదరాబాద్: నగరంలోని అఫ్జల్గంజ్ లో దోపిడీ దొంగలను అరెస్టు చేసినట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న సయ్యద్, పాషా, ఇమ్రాన్, అమీర్ ఖాన్, వసీం అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
మరో వక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారి నుంచి రూ.2.65 లక్షల నగదు, రెండు కత్తులు, 10 మొబైల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.