FbTelugu

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

అమరావతి: ఈఎస్ఐ స్కామ్ లో అప్పటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ఇవాళ శ్రీకాకులం జిల్లా నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. అవసరం లేకపోయినా మందులు కొనుగోలు చేసినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు.

రూ.16 వేల విలువచేసే బయోమెట్రిక్ మిషన్ ను రూ.70 వేలకు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఐదేళ్లలో వాస్తవ ధర కంటే రూ.151కోట్లు చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అరెస్టు చేశారు. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఇది అరెస్టు కాదని కిడ్నాప్ అని అన్నారు.

You might also like