FbTelugu

పోలవరంలో గడ్డర్ల అమరిక పూర్తి

అమరావతి: పోలవరం స్పిల్ వే లో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్ట్ స్పిల్ వే కు గడ్డర్ల అమరిక పూర్తయింది. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగించారు.
అతితక్కువ కాలం అంటే 60 రోజుల్లోనే 192 గడ్డర్లను కాంట్రాక్టు ఏజెన్సీ అమర్చింది. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం లో గడ్డర్లు కీలకంగా మారాయి. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్ల వినియోగించారు. స్పిల్ వే పై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం జరిగింది. ఒక్కోగడ్డర్ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు కాగా ఒక గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు ఉందంటే దీనిని బట్టి ఎంత పెద్ద గడ్డర్లో అర్థం చేసుకోవచ్చు.

స్పిల్ వే కి ఇంత భారీ పరిమాణం, గడ్డర్ల సంఖ్య వినియోగం చాలా అరుదు. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్లు ఉపయోగించారు. గడ్డర్లను స్పిల్ వే పిల్లర్ల జూలై-6-2020 అమర్చడం ప్రారంభించారు. గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం కొనసాగించారు. ఫిబ్రవరి 20, 2021 నాటికి స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.