FbTelugu

మాస్క్, బెజోస్ లను వెనక్కి నెట్టేసిన అర్నాల్డ్

పారిస్: ప్రపంచ కుబేరులను ఆయన వెనక్కి నెట్టేశారు. ఆయన పేరు అంతగా మనం వినుండకపోవచ్చు. కాని ఇఫ్పుడు ఆయన పేరు మారు మోగిపోతున్నది. ఆయన ప్రాన్స్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్డ్.

వారం రోజుల క్రితం ప్రపంచ ధనవంతుడు అయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ఫ్రాన్స్ కు చెందిన బిలియనర్, లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్.వి.హెచ్.ఎం అధినేత అర్నాల్డ్ వెనక్కి నెట్టారు. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబెరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అర్నాల్డ్ పేరొందుతున్నారు. తన సొంత కంపెనీ లేబుల్ బ్రాండ్ విలువ పెంచేందుకు ఆయన ఈ మధ్యే 538 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఈ నిర్ణయంతో ఎల్.వి.హెచ్.ఎం సంస్థ విలువ అమాంతం పెరిగింది. ఫలితంగా అమెజాన్ సంస్థ విలువ 1 శాతం పడిపోయింది. కాని ఇద్దరూ సంపద విషయంలో సమానంగా 186 బిలియన్ డాలర్లతో ఉన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం న్యూయార్క్ లోని స్టాక్ మార్కెట్ మూతపడే సమయానికి బెజోస్ కంటే 100 మిలియన్ డాలర్ల సంపదతో అర్నాల్డ్ ముందుండడం ప్రపంచలోని కుబేరులను ఆశ్చర్యపరిచింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.