FbTelugu

3 రహస్య స్థావరాలను కనుగొన్న బలగాలు

జమ్ముకశ్మీర్: ఈ రోజు ఉదయం భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో స్థానిక షోపియన్‌లోని యార్వాన్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల మూడు రహస్య స్థావరాలను భద్రతా బలగాలు కనుగొన్నాయి.

ఈ రహస్య స్థావారాల్లో వ్యక్తిగత డైరీతో సహా.. అనేక వస్తువులు లభించాయి. నిత్యం జీవితంలో వాడే ప్రతి వస్తువూ (నిత్యావసరాలు) అక్కడ లభించాయి. కాగా తమ ఆపరేషన్ లో పురోగతి సాధించామని, ఈ ఆపరేషన్ కొనసాగుతోందని సైనికాధికారులు తెలిపారు.

You might also like