FbTelugu

మే 16 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

అమరావతి: గుంటూరు జోన్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ 16వ తేదీ మే 2021 నుంచి 30వ తేదీ మే 2021 వరకు గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి సంబంధించిన వివరాలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు ఇలా ఉన్నాయి. ఈ పోస్టులకు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వారు మాత్రమే అర్హులు అని అధికారులు వెల్లడించారు.

పోస్టులు – రకాలు
1. సోల్జర్ టెక్నీకల్
2. సోల్జర్ జనరల్ డ్యూటీ
3. సోల్జర్ ట్రేడ్ మెన్
4. సోల్జర్ క్లర్క్
5. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్

దరఖాస్తు తేదీలు:
ఆన్ లైన్ లో మార్చి 17 నుంచి ఏప్రిల్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
01 మే నెల నుంచి అడ్మిట్ కార్డులు పంపిస్తారు.
వయస్సు:
17 సంవత్సరంల 6 నెలల నుండి 23 సంవత్సరంల మధ్య ఉండాలి (సోల్జర్ జనరల్ కు 17 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరాలు)
నోట్:
1) సోల్జర్ జీడీ పోస్టు కోసం 01 అక్టోబర్ 2000 నుంచి 01 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
2) సోల్జర్ టెక్నికల్/నర్సింగ్/క్లర్క్/ట్రేడ్ మెన్ లకు 01 అక్టోబర్ 1998 నుంచి 01 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించి ఉండాలి.
విద్యార్హత:
10 వతరగతి పాస్/కొన్ని పోస్టులకు ఇంటర్ పాస్ ఆపై చదువు ఉండాలి.
ఎత్తు 168 సెంటిమీటర్లు, బరువు 50 కేజీలు.
ఛాతి 77 సెంటిమీటర్లు (గాలి పిల్చితే 5 సెంటిమీటర్లు పెరగాలి)
ఫిజికల్ టెస్టులు:
1) 1.6 కి.మీ(1600మీటర్లు) దూరాన్ని 5 నిమిషాల 45 సెకండ్ లో పరుగెత్తాలి.
2) 9 అడుగుల దిచి జంప్.
3) పుల్ అప్స్/బస్కీలు (కనీసం 6) .
4) బ్యాలెన్సింగ్ భీమ్.

You might also like

Leave A Reply

Your email address will not be published.