FbTelugu

ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాపై నేడు వాదనలు

నల్లగొండ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమాపై నేడు నల్లగొండ జిల్లా కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

మర్డర్ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ.. గత నెల 29న జిల్లా కోర్టులో అమృత సూట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మర్డర్ సినిమా దర్శక, నిర్మాతలకు కోర్టు నోటీసులు పంపింది. నేడు దర్శక, నిర్మాతల తరపున న్యాయవాది వాదనలు కోర్టుకు వినిపించనున్నారు.

You might also like